ఏపీలో దారుణం.. తల్లీకొడుకు హత్య!

AP: అనంతపురం జిల్లాలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి శారదానగర్‌లో తల్లీకొడుకు దారుణ హత్యకు గురయ్యారు. మృతురాలు అమూల్య ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో మృతి చెందగా, ఆమె కొడుకు సహస్ర గొంతు కోసి ఉండటంతో ఇద్దరినీ పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అమూల్య రామగుండం డిప్యూటీ తహసీల్దార్ భార్యగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్