AP: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన ఆనంద్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బేల్దారి పనులకు వెళ్లడంతో ఆమె అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఆదివారం అర్ధరాత్రి ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న బాలికను నిందితుడు తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం బాలిక మృతదేహాన్ని ఇంటి వద్ద కుర్చీలో కూర్చోబెట్టి పరారయ్యాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.