ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై ఇద్దరు సహోద్యోగుల అత్యాచారానికి పాల్పడ్డారు. కేఫ్ మూసివేసిన తర్వాత లోపలికి వెళ్లి ఎనిమిది మంది మద్యం సేవించారు. సామూహిక అత్యాచారానికి మరో ఇద్దరు యువతులు సహకరించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులను పోలేసులు అరెస్టు చేశారు.