దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి (వీడియో)

TG: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా పరిధిలోని గాజులరామారంలో 7 ఏళ్లు, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులను తల్లి కొడవలితో నరికి చంపింది. తర్వాత ఆమె కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్