TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం అప్పుడే పుట్టిన ఆడశిశువు మృతదేహాన్ని కుక్క నోటితో పట్టుకొని వెళ్తుండగా స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు శిశువును ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేయగా దాన్ని కుక్క తీసుకెళ్లింది. అనుమానం వచ్చి స్థానికులు కుక్కను తరిమేసి చూడగా మృతదేహం ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.