ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన మహిళకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు, ప్రమాదకరమైన బ్లేడు ముక్కను ఆమె కడుపులోనే వదిలేశారు. ఆపరేషన్ తర్వాత నొప్పి తగ్గకపోగా, తీవ్రతరం కావడంతో వేరే ఆసుపత్రికి తరలించగా, స్కానింగ్‌లో ఈ విషయం బయటపడింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుల నిర్లక్ష్యంపై రోగి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.