AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. ఓ యువకుడిని వెంటాడి వేట కొడవలితో నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్థిక లావాదేవీల విషయంలో హర్షదర్ధన్, నాగరాజు మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగరాజు ఇంటికి వెళ్లి హర్షవర్ధన్ చంపుతానని బెదిరించాడు. దాంతో నాగరాజు వేటకొడవలితో దాడి చేశాడు. వెంటాడి నరికాడు. గాయపడిన హర్షవర్ధన్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దర్యాప్తు జరుగుతోంది.