TG: మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి జరిగింది. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నిరసనగా జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ దాడిలో ఎమ్మెల్సీ మల్లన్న చేతికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.