గుజరాత్ సబర్‌కాంత జిల్లా గడివక్డ్‌లో కమ్లాబెన్ అనే మహిళను మంత్రగత్తెనని కొందరు గ్రామస్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఆమె ఇంటిపై దాడి చేయడానికి వెళ్లిన గ్రామస్థులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె భర్త మనుభాయ్ రామ్‌జీభాయ్ దామోర్‌పై మూకదాడి జరిగింది. ఈ దాడిలో మనుభాయ్ తలకు తీవ్ర గాయాలై, ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, 12 మంది గ్రామస్థులను అరెస్టు చేశారు. మూఢనమ్మకాలతో ప్రజల ప్రాణాలు తీయొద్దని పోలీసులు హెచ్చరించారు.