గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పెంపుడు కుక్క విషయంలో ఏర్పడిన స్వల్ప వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గొడవ క్రమంలో ఒక యువకుడిపై ప్రత్యర్థులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నారు