త్రిపురలోని సెపహ్లిజాల జిల్లాలో బీఎస్‌ఎఫ్ జవాన్లపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అశాబారి గ్రామంలో స్మగ్లింగ్ ఆరోపణలపై స్థానికుడిపై జవాన్లు దాడి చేశారంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో కర్రలతో ముగ్గురు జవాన్లపై దాడి చేసి, ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఘటనలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. దాడికి సంబంధించి ముగ్గురు మహిళలతో సహా పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.