వంటమనిషిపై దాడి.. ఐపీఎల్‌ క్రికెటర్‌పై కేసు

పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌పై భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమను దూషించి, దాడి చేశారని ఇంట్లో పనిచేసే వంట మనిషి ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. వంట మనిషిగా చేరిన తనకు ఉచిత వసతి, భోజనం, జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో సహాయం చేస్తామని హామీ ఇచ్చారని, అయితే వంటల్లో నాణ్యత లేదని తనను దూషించి, కొట్టి, ఫోన్ లాక్కున్నారని బాధితుడు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్