యూపీలోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ CRPF జవాన్ పై కన్వారియాలు దాడి చేశారు. అతడ్ని కొట్టడంతో పాటు కాళ్లతో తన్నారు. రైలు టికెట్ కొనే విషయంలో అక్కడున్న సీఆర్పీఎఫ్ జవాన్ తో కన్వారియాలకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అతడిపై దాడికి దిగారు. ఈ సమాచారం తెలుసుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని దాడిచేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.