TG: కేటీఆర్ పీఏ మహేందర్, పీఆర్వో మహేష్పై పోలీస్ స్టేషన్లోనే దాడి జరిగినట్లు సమాచారం. మాస్కులు ధరించి స్టేషన్లోకి వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసుల సమక్షంలోనే వారిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారు కాంగ్రెస్ కార్యకర్తలై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్లోనే దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నారు? దాడికి ఎవరు ఉసిగొల్పారు? వారికి ఎవరు సహకరించారనే అంశాలపై చర్చ జరుగుతోంది.