హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో ఓ రోగి సహాయకురాలిపై సెక్యూరిటీ సిబ్బంది మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక మహిళా సెక్యూరిటీ గార్డు మొదట దాడి చేయగా, మరో ముగ్గురు మహిళా సెక్యూరిటీ సిబ్బంది కూడా తోడై దాడికి పాల్పడ్డారు. అనంతరం అధికారులు, వైద్యులు బాధితురాలికి సర్దిచెప్పి పంపినట్లు తెలిసింది. ఈ దాడి ఎప్పుడు, ఎందుకు జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. సూపరిండెంట్ స్పందించలేదు, పోలీసులకు ఫిర్యాదు అందలేదని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.