AP: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌లో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవ చెలరేగింది. ఇద్దరు అన్నలపై నడిపి గురయ్య అనే వ్యక్తి బండరాళ్లతో దాడికి దిగాడు. ఈ దాడిలో చిన్న గురయ్య మృతి చెందగా.. పెద్ద గురయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గాయపడిన వ్యక్తిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.