స్పా సెంటర్‌‌పై దాడి.. 20 మంది అరెస్ట్

యూపీలోని ఘజియాబాద్‌లో ప్యూర్ థెరపీ, ఆల్ స్పా, మౌంటెన్ స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా వ్యభిచారంలో పాల్గొంటున్న 20 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈ అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న 11 మంది ఆపరేటర్లు మరియు మేనేజర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సంఘటనా స్థలంలో పోలీసులు అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడుతున్న కేంద్రాలపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕