బంగ్లాదేశ్‌లో ఖోకన్ చంద్ర దాస్(50) అనే హిందు వ్యాపారిపై దుండగులు దాడి చేసి నిప్పంటించారు. వారి నుంచి తప్పించుకునేందుకు చెరువులో దూకిన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చంద్రదాస్ వ్యాపార నిమిత్తం వెళ్తుండగా ఈ దాడి జరిగింది. తమకు శత్రువులు ఎవరూ లేరని, దాడికి కారణం తెలియదని ఆయన భార్య సీమా దాస్ పేర్కొన్నారు.