దాడులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు: ఎమ్మెల్సీ మల్లన్న

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జరిగిన దాడిపై ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. 'హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇలాంటి దాడులకు మల్లన్న భయపడతాడనుకుంటే మీ భ్రమే అవుతుంది. మా గన్‌మెన్ వద్ద ఉన్న తుపాకీ లాక్కుని మా సిబ్బందిపై దాడి చేశారు. నాతో సహా పలువురికి గాయాలయ్యాయి. కంచం, మంచం అనేది తెలంగాణలో ఊతపదం. నేను ఏం తప్పు మాట్లాడానో ప్రజలే నిర్ణయిస్తారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్