TG: హైదరాబాద్ నేరేడ్ మెట్ పీఎస్ పరిధిలోని కట్ట మైసమ్మ గుడి వివాదంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. బొడ్రాయిపై, కట్ట మైసమ్మ గుడి ఓ మతానికి చెందిన వ్యక్తి మూత్రవిసర్జన చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని, ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని అన్నారు.