మహిళలపై దాడులు బాధాకరం: విక్రమ్‌

మహిళలపై జరుగుతున్న దాడులను ఉద్దేశించి నటుడు విక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో కోరారు. ‘‘మహిళలందరికీ రక్షణ కల్పించాలి. తెల్లవారుజామున 3.00 గంటలకు సైతం మహిళలు స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలి. ఆ సమయంలోనూ బయటకు వెళ్లి క్షేమంగా ఇంటికి వెళ్లగలమనే నమ్మకం వారికి కలగాలి. ప్రతి పురుషుడు ఆమెను రక్షించడానికి, వారికి సురక్షిత స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి’’ అని విక్రమ్‌ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్