మొత్తం సమాజాన్నే నాశనం చేసే ప్రయత్నం: ఇరాన్‌ అధ్యక్షుడు

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజాగ్రహం తీవ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో వంద మందికిపైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో, దేశాధ్యక్షుడు పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లరి మూకలు సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూనే, నిరసనకారుల వాదనలు వినేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే సమాజాన్ని నాశనం చేయకుండా చూడటం ముఖ్యమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్