తుపాకీతో కోడిని కాల్చేందుకు ప్రయత్నం.. గురి తప్పి యువకుడి మృతి

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కల్వరాయన్‌మలై ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడటానికి చట్టవిరుద్ధంగా వాడే నాటు తుపాకీతో గురువారం సాయంత్రం అన్నామలై అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో మేస్తున్న నాటు కోడిని కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే గురి తప్పి తూటా పక్కింట్లో కూర్చొని ఉన్న ప్రకాష్‌(28) అనే యువకుడి తలకు తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కరియలూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్