వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో అధ్యక్షుడు ట్రంప్ సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. నిందితుడు కోల్ థామస్ అలెన్, కాల్పులకు ముందు తన లక్ష్యాలను కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దర్యాప్తులో, నిందితుడికి క్రైస్తవ వ్యతిరేక భావాలు ఉన్నాయని, కాష్ పటేల్ హిందువు కాబట్టి అతన్ని లక్ష్యం నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అలాగే, 'రూల్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్' ప్రకారం లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను లక్ష్యంగా చేసుకోకూడదని నిందితుడు తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సమాచారం.