AP: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపై అత్యాచార యత్నానికి ప్రియుడికి సహకరించిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం బాలికను తన ప్రియుడు వద్దకు తల్లి బలవంతంగా తీసుకెళ్లిందని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బాలిక తల్లి, ఆమె ప్రియుడు సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.