TG: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేములపల్లి మండలానికి చెందిన ఓ వివాహితపై గంట కృష్ణయ్య అనే వ్యక్తి గత నెల 21న అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సదరు మహిళ గట్టిగా అరవడంతో.. కృష్ణయ్య అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. అవమానభారంతో ఆమె గురువారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహూటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.