చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై పోక్సో కేసు

TG: హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో శనివారం ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఆసుపత్రి ఆవరణలో నివాసం ఉంటున్న కూలీ కుటుంబానికి చెందిన బాలికపై, తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్