మయన్మార్ అగ్రనేత ఆంగ్ సాన్ సూకీని గృహ నిర్బంధంలోకి తరలించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. 80 ఏళ్ల నోబెల్ గ్రహీత సూకీ, దేశ రాజధాని నైపియితాలోని జైలులో చాన్నాళ్ల నుంచి ఉన్నారు. 2021 మిలిటరీ తిరుగుబాటు తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన శిక్షా కాలాన్ని ఆమె ఇంటిలోనే గడపనున్నారని మిలిటరీ నేత మిన్ ఆంగ్ హ్లైంగ్ తెలిపారు. అవినీతి, ఎన్నికల మోసం కేసుల్లో ఆమెకు 27 ఏళ్ల శిక్ష పడింది. ఆమె కుమారుడు కిమ్ ఆరిస్, ప్రభుత్వం విడుదల చేసిన ఫోటో 2022లో తీసినదని, తన తల్లి బతికి ఉన్నట్లు ఆధారాలు లేవని ఆరోపించారు.