TG: సిగాచీ దుర్ఘటనలో ఇద్దరు మేనల్లుళ్ల ఆచూకీ కోసం ఎదురుచూస్తూ వారి మేనత్త గుండె ఆగిపోయింది. యూపీకి చెందిన అన్నదమ్ములు అఖిలేష్ నిషాంత్(38), విజయ్‌కుమార్ నిషాంత్(30) సిగాచీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. పేలుడు సమయంలో వారు ప్రాణాలతో వస్తారని మేనత్త ధీర ఎదురుచూసింది. అధికారులు ఎనిమిది మంది ఆచూకీ తెలియడం లేదని, తక్షణ సహాయంగా రూ.15 లక్షలు ప్రకటించడంతో బుధవారం ఆమె కుప్పకూలి ప్రాణాలు విడిచారు.