ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత లక్ష్యం 265 పరుగులు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులతో రాణించగా.. హెడ్ 39, లబుషేన్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా, వరుణ్ చెరో రెండు, అక్షర్ 1, హార్దిక్ 1 వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్