డర్బన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేత దక్షిణాఫ్రికాకు స్వదేశంలో డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ షాక్ ఇచ్చింది. నాలుగో ఇన్నింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్ (6-49) ఆరు వికెట్లతో చెలరేగడంతో ఆతిథ్య జట్టు 214 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఎడెన్ మర్క్‌రమ్ (75) అర్ధశతకంతో రాణించినా ఫలితం లేకపోయింది. మ్యాట్ రెన్‌షా (2-30) బంతితోనూ రాణించి, బ్యాటింగ్‌లోనూ ఆసీస్‌కు అండగా నిలిచాడు. ఈ విజయంతో కింగ్స్‌మీడ్ స్టేడియంలో ఆసీస్‌కు ఇది వరుసగా నాలుగో గెలుపు కాగా, కెప్టెన్ తెంబ బవుమాకు తొలి ఓటమి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕