టెస్ట్ క్రికెట్‌లో చెత్త రికార్డు నమోదైంది. జమైకాలో జరిగిన టెస్ట్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ను 27 పరుగులకు ఆలౌట్ చేసి 3-0 తేడాతో ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇందులో ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. మిచెల్ స్టార్క్ తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. 7.3 ఓవర్లలో 4 మెయిడెన్‌లతో 9 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. బొలాండ్ 3 వికెట్లు పడగొట్టాడు.