ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా ఇంగ్లాండ్ (England)తో జరగబోయే ఐదో యాషెస్ టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం తన భార్య, పిల్లలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన 39 ఏళ్ల ఖవాజా, భావోద్వేగపూరితమైన ప్రసంగంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు.