ఆస్ట్రేలియన్ ఓపెన్.. సెమీస్‌కు సిన్నర్

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సిన్నర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సెమీ ఫైనల్ కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్‌ను 6-3, 6-4, 6-4 తేడాతో ఓడించాడు. మరోవైపు, 10 సార్లు విజేత నోవాక్ జొకోవిచ్ కూడా సెమీస్‌కు అర్హత సాధించాడు. ప్రత్యర్థి ముసెట్టి గాయం కారణంగా వైదొలగడంతో జొకోవిచ్‌కు ఇది సులభమైంది. శుక్రవారం జరిగే సెమీ ఫైనల్లో సిన్నర్, జొకోవిచ్ మధ్య బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరగనుంది. మహిళల విభాగంలో రైబాకిన, పెగుల సెమీస్‌కు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్