తుని అత్యాచార ఘటనపై అధికారులు సీరియస్

AP: తుని అత్యాచార ఘటనపై అధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఈ మేరకు స్కూల్‌లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఈడీ మస్తానయ్య విచారించారు. బాలికను నారాయణరావుతో పంపించడంపై ఆరా తీశారు. ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్‌ను మస్తానయ్య వివరణ అడిగారు. మీ పిల్లలు అయితే ఇలాగే పంపిస్తారా? అని సీరియస్ అయ్యారు. కాగా, బాలికపై అత్యాచారానికి పాల్పడిన నారాయణరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తుని ఆస్పత్రి మార్చురీలో ఆయన మృతదేహం ఉంది.

సంబంధిత పోస్ట్