పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో ఘటన.. మృతులు వీరే

AP: బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి వద్ద ఆటో పంట కాల్వలోని దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. కొబ్బరి లోడుతో కొల్లూరు నుంచి వెల్లటూరు వైపు వెళ్తోన్న ఆటో అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. మృతులు చింతమోటు గ్రామానికి చెందిన చాట్రగడ్డ కాంతారావు (48), పెసర్లంక శ్రీనివాసరావు (55), షేక్ ఇస్మాయిల్ (55)గా గుర్తించారు. ఘటనపై కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్