మహారాష్ట్రలోని పల్ఘర్‌లో వలస వచ్చిన ఆటో డ్రైవర్‌ను శివసేన, ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మరాఠీ మాట్లాడలేదని బహిరంగంగా కొట్టారు. దీనికి కారణం విరార్ స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ “నేను హిందీలోనే మాట్లాడతాను” అని చెప్పిన వీడియో వైరల్ అవడం. దీంతో శనివారం ఆయనపై మహిళలతో సహా చాలా మంది దాడి చేశారు. మహారాష్ట్రకు బహిరంగ క్షమాపణ చెప్పించారు. ఈ దాడి వీడియో కూడా ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారింది.