విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం (వీడియో)

AP: తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వేరే హాస్టల్‌కు మారే క్రమంలో పరిచయమైన ఆటో డ్రైవర్ను విద్యార్థిని ఆర్థిక సహాయం కోరడంతో ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకున్నాడు. బాలికను తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. బెదిరింపులకు గురైన బాధితురాలు ధైర్యం చేసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్