కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాగేపల్లిలో కారు కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టడంతో.. ఆటో ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. పలువురు గాయపడగా ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బాగేపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు.