డివైడర్‌ను ఢీకొని బోల్తాపడిన ఆటో (వీడియో)

AP: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని కొత్తకోటవారి వీధి జంక్షన్‌ వద్ద ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕