మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఆటోడ్రైవర్ రోడ్డుపై వేగంగా వస్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు వచ్చింది. రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌తో పాటు, ఆటోలోని ప్రయాణికుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.