BIG BOSS నుంచి అవినాష్ ఎలిమినేట్

బిగ్ బాస్ సీజన్-8 నుంచి అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. టాప్-5 కంటెస్టెంట్‌లలో ఉన్న అయన ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. 'వైల్డ్ కార్డ్' ద్వారా ఈ సీజన్ మధ్యలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాశ్, తన కామెడీతో అభిమానులను అలరించారు. ఫినాలే గెస్టుల్లో ఒకరైన కన్నడ నటుడు ఉపేంద్ర హౌస్‌లోకి వెళ్లి ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. కాగా, అవినాష్ గతంలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్