తెలుగులో దాదాపు 750 చిత్రాలకుపైగా నటించి తెలుగు నాట చెరిగిపోని ముద్ర వేశారు కోట. 1998లో గణేశ్ సినిమాలో విలన్ పాత్రకుగానూ తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. ఆయన నటనకు గాను మొత్తం 9 నంది పురస్కారాలు వరించాయి. 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి SIIMA అవార్డును అందుకున్నారు. 2015లో భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి గాను భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు.