బంగారు వర్ణంలో మెరిసిన ‘అయోధ్య’

అయోధ్య రామాలయం దీపావళి పండుగ వేడుకల కోసం అద్భుతంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో గుడిని అలంకరించగా, ఆలయం బంగారు వర్ణంతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పవిత్ర నగరంలో శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. ఈ సందర్భంగా భక్తికి చిహ్నంగా దీపాలను వెలిగించాలని ట్రస్ట్ భక్తులకు పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింథియా కూడా ఈ అద్భుత దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕