అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన రూ.5 కోట్ల విలువైన రామ్‌చరిత్‌మానస్ పుస్తకం అదృశ్యమైందన్న ఆరోపణలను ట్రస్ట్ ఖండించింది. ఆ బంగారు పూత పుస్తకాన్ని మీడియా ముందు ఉంచారు. కానుకగా వచ్చిన ప్రతీ వస్తువుకు రిజిస్టర్ మెయింటెన్ చేస్తున్నామని, భక్తులు నేరుగా వచ్చి సరిచూసుకోవచ్చని స్పష్టం చేసింది.