వర్షాకాలంలో పుదీనా వాడకం.. ఆయుర్వేద నిపుణుల హెచ్చరిక

వర్షాకాలంలో పుదీనాను పచ్చిగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో తేమ వల్ల పుదీనా ఆకులపై బ్యాక్టీరియా, వైరస్‌లు చేరే అవకాశం ఉంది. ఇది ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, కడుపు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. పుదీనాకు చలువ చేసే గుణం ఉంటుంది. వర్షాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఈ సమయంలో చలువ చేసే పదార్థాలను తీసుకోవడం వల్ల వాత, కఫ దోషాలు అసమతుల్యంగా మారి కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్