ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా రూ.5 లక్షల ఉచిత వైద్యం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. లబ్ధిదారుల జాబితాలో పేరు సరిచూసుకోవడం, చికిత్స సమయంలో ఆధార్ వంటి ఒరిజినల్ ఐడీలను వెంట ఉంచుకోవడం ముఖ్యం. అలాగే ఈ పథకం నమోదిత ఆసుపత్రుల్లో మాత్రమే వర్తిస్తుంది. యాక్టివ్ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. ఉచిత చికిత్సకు ఆసుపత్రి వారు డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.