దాదాపు మూడేళ్ల తర్వాత అక్కినేని హీరో అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సక్సెస్‌ను అక్కినేని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బుధవారం గుంటూరులో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ కూడా పాల్గొన్నారు. ఆమె 'లెనిన్' విజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, 'అయ్యగారే నెంబర్ వన్' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సినిమా హిట్ కావడం పట్ల తాను చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నానని తెలిపారు.