శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు

కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో మండల-మకరవిలక్కు వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న గుడి తలుపులు తెరుచుకోగా, తొలి రెండు రోజుల్లోనే రెండు లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారు. దీంతో స్వామి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నట్టు సమాచారం. ఆలయ ప్రాంగణం, పంబా నుంచి సన్నిధానం మార్గంలోనూ రద్దీ నెలకొంది.

సంబంధిత పోస్ట్