TG: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష్ నగర్‌కు చెందిన బండారి అశోక్-గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు బండారి మనోజ్ఞ (22) HYDలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. శనివారం వనస్థలిపురంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం మరణించింది.